టాక్ఆన్: ప్రశ్నల ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న భారతదేశపు అత్యుత్తమ క్విజ్ కంపెనీ
- Vishnu
- Jan 26
- 3 min read
మీకు తెలుసా...?
“టీ” మరియు “చాయ్” అనే పదాలు ప్రపంచ వ్యాప్తంగా తేనీరు(Tea) అనే పానీయానికి వాడే పేర్లు. ఈ టీ చైనా నుంచి భూమి ద్వారా వ్యాపిస్తే దాన్ని 'చాయ్' అని; సముద్రం ద్వారా వ్యాపిస్తే దానిని 'టీ' అని పిలుస్తారు.

మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మీరు రాత్రి ఆకాశంలో దానిని చూసే ప్రతిసారీ, మీరు 4 సంవత్సరాల గతంలోకి చూస్తున్నారని అర్థం!

సహజమైన రబ్బరు పాలలా తెల్లగా ఉండడం వల్ల మొదట్లో తయారు చేసిన వాహన టైర్లు తెల్లగా ఉండేవి. తరువాతి కాలంలో టైర్ల దృఢత్వాన్ని పెంచడానికి కార్బన్ ను జోడించడం వలన ప్రస్తుతం మనం చూస్తున్న నలుపు రంగు వచ్చింది.

ప్రపంచంలో రోజూ కోట్ల మంది ఇష్టంగా సేవించే పననియం టీ. మీరు కూడా వారిలో ఒకరు కావచ్చు. కానీ పైన చదివిన వాస్తవము గురించి మీకు తెలుసా? మీరు ఒక హోటల్ చైన్ లేదా టీ బ్రాండ్ యజమాని అయితే, మీ వినియోగదారులను ఇలాంటి అద్భుతమైన వాస్తవాలతో ఆకర్షిస్తే ఎలా ఉంటుంది? అలాగే ఈ వాస్తవాన్ని ఒక ప్రశ్న రూపంలో సంధించి వినియోగదారుడే కథను నిర్మిస్తే?
అదేవిధంగా, ప్రాక్సిమా సెంటారీ ఉదాహరణ ఇచ్చి కాంతివేగం మరియు రిలేటివిటీ సిద్ధాంతం గురించి అన్వేషించడానికి పిల్లల్లో ఆశక్తి రేకెత్తించగలిగితే? మరియు " డన్లప్ మొదట డెవలప్ చేసిన టైర్ల రంగును మీరు ఊహించగలరా? నలుపు/ఆకుపచ్చ/తెలుపు/నీలం" వంటి ప్రశ్నతో బోరింగ్ కెమిస్ట్రీని ఆసక్తికరంగా మార్చగలిగితే?
TackOn అదే చేస్తుంది!
టాక్‌ఆన్ క్విజ్‌లు, కంటెంట్, టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రత్యేకత కలిగిన సంస్థ. వీరు స్థానిక స్థాయి నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు విభిన్నమైన కస్టమర్లకు సేవలను అందిస్తారు. దశాబ్దకాల అనుభవం, 200కి పైగా కస్టమర్ల నమ్మకం కలిగిన ఈ సంస్థ వివిధ విషయాలపై నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, వ్యక్తులు మరియు సంస్థలు తమ జ్ఞానాన్ని విస్తరించుకోవడంలో, ప్రశ్నల ద్వారా కథలు, కథల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సహాయం చేస్తుంది.

ప్రతి సందర్భం, ప్రతి విషయానికి సరిపోయే క్విజ్‌లు ఉన్నాయని చెప్పడం తప్పు కాదు - మీ జిజ్ఞాసను తీర్చడానికి ప్రతి శ్రేణిలో టాక్‌ఆన్ మీకు సరైన కంటెంట్‌ను అందిస్తుంది! టాక్‌ఆన్ టీవీ షోలను ప్రణాళిక దశ నుండి అమలు వరకు పూర్తి చేయడంలో నిపుణత కలిగిన సంస్థ. కంటెంట్‌ను ప్రధానంగా తీసుకుని, టాక్‌ఆన్ - భారతదేశంలో ఉత్తమ క్విజ్ సంస్థగా, క్విజ్‌లు, వీడియోలు, టీవీ షోలు లేదా వెబ్‌సైట్‌లు వంటి సరైన మార్గాల ద్వారా సరైన ప్రేక్షకులకు సమాచారాన్ని అందించడానికి ప్రత్యేక బృందాలను కలిగినది.
భారతదేశంలో టాప్ క్విజ్ కంపెనీలలో ఒకటిగా టాక్‌ఆన్ ఎదగడానికి సహాయపడిన క్విజ్ మాస్టర్ల మరియు కంటెంట్ క్రియేటర్ల ఉత్తమ బృందం ప్రతిష్టాత్మక కస్టమర్లకు సేవలు అందించింది. వారిలో ప్రధానంగా:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
క్రీడల మంత్రిత్వ శాఖ
విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఐటీసీ
యస్ బ్యాంక్
WWF (వరల్డ్ వైల్డ్ ఫండ్)
మరియు మరెన్నో.
భారతదేశంలోని ఉత్తమ క్విజ్ కంపెనీ - TackOn ఇటీవల సేవలందించిన కొన్ని ప్రాజెక్ట్లు మరియు క్లయింట్లు
విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా భారత్ కో జానియే క్విజ్
భారత్ కో జానియే (ఇండియాను తెలుసుకోండి) క్విజ్ భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. భారత వంశజులు మరియు విదేశీయులు, ముఖ్యంగా యువతతో భారతదేశాన్ని కలుపుకోవడమే లక్ష్యంగా నిర్వహించే ఈ క్విజ్, భారత వారసత్వం, కళలు, సంస్కృతి, వంటకాలు, చరిత్ర, ప్రజలు, మరియు ప్రపంచానికి భారతదేశం చేసిన విశేషమైన సేవలను అన్వేషించేందుకు ఆహ్వానిస్తుంది. ఈ క్విజ్ పోటీలో పాల్గొనేవారిలో జిజ్ఞాసను రగిలించడమే కాక, భారతదేశంతో వారి సంబంధాన్ని మరింత బలపరుస్తుంది.
టాక్ఆన్ యొక్క టెక్ మరియు కంటెంట్ బృందాలు ఈ ప్రాజెక్టు అమలులో కీలక పాత్ర పోషించాయి, ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మందికి పైగా పాల్గొనేవారిని ఆకర్షించింది. వెబ్ పోర్టల్‌లో మీరు చూసే ప్రతి అంశం టాక్‌ఆన్ ద్వారా రూపకల్పన మరియు అభివృద్ధి చేయబడింది, అలాగే క్విజ్ కంటెంట్ కూడా టాక్‌ఆన్ మేధో సంపత్తి.
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా ఫిట్ ఇండియా క్విజ్

"ఫిట్ ఇండియా క్విజ్" భారతదేశంలో క్రీడలు మరియు ఫిట్‌నెస్‌పై నిర్వహించబడుతున్న అతిపెద్ద క్విజ్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా మీ ముందుకు తీసుకురాబడింది (వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి). ఈ టీవీ క్విజ్ ప్రోగ్రామ్ మూడవ సీజన్‌లో, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
టాక్‌ఆన్ బృందం - ప్రొడ్యూసర్లు, ఎడిటర్లు, కంటెంట్ క్రియేటర్లు, మరియు క్విజ్ మాస్టర్లు - ఈ కార్యక్రమాన్ని జిజ్ఞాసను రేకెత్తించే విధంగా జాగ్రత్తగా రూపొందించారు.
G20 - 2023 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడిన ఆర్థిక అక్షరాస్యత క్విజ్
ఫైనాన్షియల్ లిటరసీ క్విజ్ భారత రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జి20 - 2023లో నిర్వహించబడింది. జి20 యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి ఆర్థిక అక్షరాస్యత. భారత్ జి20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఈ కార్యక్రమాలు కొన్ని సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, జన భాగిదారి (ప్రజల భాగస్వామ్యం) ద్వారా సాధారణ ప్రజలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
ఈ క్విజ్ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనను పెంపొందించడం మరియు ప్రజలలో ఆర్థిక పద్ధతులపై విశ్లేషణాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కలిగి ఉంది.
ఈ కార్యక్రమం కింద, భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా ఉంచుకుని ప్రత్యేక క్విజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ క్విజ్‌లో 13 రాష్ట్రాల ఫైనల్స్ నిర్వహణలో టాక్‌ఆన్ కంటెంట్ టీమ్ మరియు భారతదేశంలోని ఉత్తమ క్విజ్ మాస్టర్ల బృందం - బోధనాపు విష్ణు, నమన్ జైన్, కమల్ బగ్గా, మరియు డాక్టర్ ప్రీతిమన్ - కీలక పాత్ర పోషించారు. టాక్‌ఆన్ బృందం క్విజ్ కంటెంట్ రూపకల్పన నుంచి ఫైనల్ ఎగ్జిక్యూషన్ వరకు ప్రతిదీ విశేష నైపుణ్యంతో నిర్వహించింది, ప్రతి రాష్ట్ర ఫైనల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
ఇతర ఈవెంట్లు మరియు బృందం యొక్క కొన్ని చిత్రాలు:




TackOn యొక్క కంటెంట్ మిమ్మల్ని ప్రపంచాన్ని అన్వేషించేలా చేస్తుంది!